Logo
Date of Publish : 25 July 2022, 3:18 pm
Editor : Sake Naresh

తండ్యాం గ్రామాలలో పేడాడ రామ్మోహన్ రావు పర్యటన

     ఆముదాలవలాస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం లో జాడ పేట మరియు తండ్యాం గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలతో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని, రోడ్లు మరమ్మత్తులు లేక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమవడంతో ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్యాం గ్రామంలో SC కాలనీలో చాలా మందికి పక్కా ఇళ్లు మంజూరు కాకపోవడంతో వర్షాకాలంలో ఉండడానికి అవకాశం లేక ప్రభుత్వం పైన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ వైఫల్యం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను మానవతా దృక్పథంతో జనసేనపార్టీ ఆధ్వర్యంలో, పరిష్కారం కోసం కృషి చేస్తానని రామ్మోహనరావు గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు చిన్నం నాయుడు, రమణ, సూర్య, బాబూరావు, బాలు, చిన్న, సంతోష్, రాజు, మధు మరియు పెద్ధ సంఖ్యలో గ్రామ జనసేన కార్యకర్త లు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com