ఆముదాలవలస ( జనస్వరం ) : మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్రావు అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో రీజనల్ డైరెక్టర్ పి. నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 250 పైచీలుకు చెరువులు ఉన్నాయని వాటిలో సగానికి సగం ఇప్పటికే కబ్జా అయ్యాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే పట్టణంలోని మున్సిపాలిటీ నిర్మించిన కూరగాయల మార్కెట్ ముందు బాగాన అధికార పార్టీ కార్యకర్తలు స్థలాలను ఆక్రమించి బడ్డీలను ఏర్పాటు చేశారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీలను ఇప్పటికే అద్దెలకు కూడా ఇచ్చేశారని వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని కోరారు. సుమారు 20 సంవత్సరాలుగా అదే స్థలంలో తోపుడుబల్లును ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్న పేదలను తరిమేసి అక్రమార్కులు బడ్డీలను ఏర్పాటు చేశారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాలువలపై బడ్డీలను ఏర్పాటు చేయడం వలన మురుగునీరు పోయే దారి లేక దోమలు విజృంభించి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సావధానంగా విన్న ఆర్ డి బడ్డీలను వెంటనే తొలగించాలని కమిషనర్ అప్పలనాయుడును ఆదేశించారు. ఈ సందర్భంగా రామ్మోహన్రావు ఆర్ డి నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.