
ఆమదాలవలస ( జనస్వరం ) : సరుబుజ్జిలి మండలం ( పెద్దపాలెం గ్రామంలో ) ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇంటి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం గురించి తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలతో కరపత్రం రూపంలో జనం కోసం జనసేన కార్యక్రమంతో పేడాడ రామ్మోహన్ రావు వివరించారు. గ్రామంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పైడి.మురళి మోహన్, మండల నాయకులు మురాల మిన్నరావు, మూడెడ్ల సత్యనారాయణ, గణేష్,కోటి, రాధాకృష్ణ, సాగర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.