ఆముదాలవలస ( జనస్వరం ) : టెక్కలి నియోజకవర్గ కార్యాలయంపై దాడి ని ఖండిస్తూ టెక్కలి ఇన్చార్జి కనితి కిరణ్ కుమార్ గారిని కలిసి సంఘీభావం తెలియజేసిన ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయాలపై దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు అలాగే రాజకీయంగా విమర్శలు సహజమేనని కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు అలాగే జనసేన నాయకులు పై భౌతిక దాడులు సరికాదని అన్నారు. అధికార పార్టీ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గారితో పాటు శ్రీకాకుళం జిల్లా నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com