
ఆముదాలవలస ( జనస్వరం ) : మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రామ్మోహన్ రావు ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో పర్యటించేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు.