Logo
Date of Publish : 25 March 2023, 3:15 pm
Editor : Sake Naresh

బొడ్డేపల్లి గేటు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి పేడాడ రామ్మోహన్ డిమాండ్

            ఆమదాలవలస ( జనస్వరం ) : పొందూరు మండలం బొడ్డేపల్లి రైల్వే గేటు సమీపంలో నిర్మించిన అండర్ పాస్ లో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ లో భారీ ఎత్తున నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కావలి, వాల్తేరు, పనసపేట తదితర ప్రాంతాల ప్రజలు, శ్రీకాకుళం జిల్లాలోని బెలమాం, లొద్దలపేట, తాడివలస, గండ్రేడు, లత్సయ్యపేట, గోరింట, గోకర్ణపల్లి, వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో నిరంతరం శ్రీకాకుళం పట్టణానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అండర్ పాస్ వరకు వచ్చి మరలా వెనుకకు వెళ్లి పొందూరు మీదుగా శ్రీకాకుళం చేరడానికి కొన్ని గంటల సమయాన్ని వృధాచేసుకొనే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పదుతుంది. దీంతో రైల్వే అధికారులను తిట్టుకుంటూ ఊసురోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అండర్ పాస్ లో చేరిన నీరు నాగావళి నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కాకపోవడంతో ఈ తీవ్ర సమస్య ఏర్పడుతుందని ప్రయాణికులు రైల్వే అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని పేడాడ రామ్మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్, మండల నాయకులు పొన్నాడ బాలకృష్ణ, యశ్వంత్, నాయుడు, రాజు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com