విజయనగరం ( జనస్వరం ) : వర్షా భావం వలన మరియు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు నుండి ఈ వైసిపి ప్రభుత్వం సమయానికి సాగునీటిని అందించడం లేదని జనసేన నాయకులు వాపోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పడిన కరువు ఛాయలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తరుణంలో, శృంగవరపుకోట నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి శృంగవరపుకోట నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ సన్యాసి నాయుడు, వేపాడ మండల అధ్యక్షులు సుంకర అప్పారావు ఆధ్వర్యంలో రైతు గర్జన తలపెట్టారు. నియోజవర్గంలో 5 మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వీరమహిళలంతా కలిసి రైతన్నకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నామని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com