Logo
Date of Publish : 22 October 2023, 9:59 pm
Editor : Sake Naresh

రాజారెడ్డిపై వైసీపీ గుండాలు చేసిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ

  ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి పై వైసీపీ గుండాలు చేసిన దాడికి నిరసనగా ఈ రోజు చిలకం మధుసూదన్ రెడ్డి శాంతి ర్యాలీని నిర్వహించాలనుకోవడంతో కేతిరెడ్డి మమ్మల్ని శాంతి ర్యాలీ చేయనీకుండా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. పోలీసులకు ఒత్తిడి పెట్టి మా ఇంటి దగ్గరికి పంపించి అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ర్యాలీలు చేసుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ,ప్రతి పౌరునికి ఉంటుందని కానీ ధర్మవరంలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. రాజారెడ్డి ఒక సౌమ్యుడు అతని మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. అటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే మాకు కడుపు మండదా అంటూ రాజారెడ్డి కేసులో ఇంతవరకు కూడా ముద్దాయిలని అరెస్టు చేసినట్టు చూపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంటే ధర్మవరంలో కేతిరెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఎక్కడైనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవాలి ఇక్కడ మాత్రం అలా జరగడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, నియోజకవర్గాల ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com