ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పిసిని చంద్రమోహన్ గారికి ఆముదాలవలస పట్టణంలోని అమ్మ ఫంక్షన్ హాల్ లో జనసేన సీనియర్ నాయకులు పాపారావు గారు మరియు తూర్పు కాపు రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు కొల్ల జయరాం గారి అధ్యక్షతన ఘన సన్మాన కార్యక్రమం మరియు అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ ఈ సన్మాన సభకు అంతా తానై అహర్నిశలు శ్రమించిన జనసేన నాయకులు కొల్లా జయరామ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే పిసిని చంద్రమోహన్ గారు పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీలో చేరడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలందించడం ఎంతో సంతోషకరమని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో మిత్రపక్షమైన టిడిపితో కలిసి పనిచేస్తూ ఉమ్మడి జనసేన టిడిపి ప్రభుత్వ స్థాపనకై కృషి చేస్తామని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి హోదాలో చూడబోతున్నామని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు సరుబుజ్జిల మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, పొందూరు మండల అధ్యక్షులు యలకల రమణ, ఎంపిటిసి అంపిలి విక్రం,కొంచాడ సూర్య, తోట సునీత, సుశీల, మజ్జి రాంబాబు, మామిడి సత్యనారాయణ, సీపన రమేష్ , రుoకు అనంత్, తూలుగు సతీష్, గార బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com