Logo
Date of Publish : 06 August 2022, 3:06 pm
Editor : Sake Naresh

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట

    నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు కోలాహలంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 80 రోజుల క్రితం ప్రారంభమైన పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 3, 4, 5, 39, 40 మొత్తం ఐదు డివిజన్లలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా, ఐదో అంతస్తులోని కుటుంబాలను కూడా పలుకరిస్తూ సాగిందన్నారు. ప్రజలందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని, పవన్ కళ్యాణ్  ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, వారి ఆదరాభిమానాలతో రెట్టింపు ఉత్సాహంతో ప్రజాబాటని నిర్వహిస్తున్నామని అన్నారు. ఒక్కో డివిజన్లో మొత్తం అన్ని ఇళ్ళకు తిరిగి సమస్యలను అధ్యయనం చేయడానికి 15 రోజుల నుండి 20 రోజుల వరకు పడుతోందని, ఇప్పుడు ప్రారంభించిన 51వ డివిజన్లో కూడా సుమారు రెండు వారాలకు పైగానే పట్టొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com