నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు నగరంలోని రాధే గెస్ట్ ఇన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మే 17వ తేదీన ప్రారంభమైన పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా, నిరాటంకంగా డిసెంబర్ 2వ తేదీ నాటికి 200వ రోజుకి చేరుతున్న సందర్భంగా జనసేన శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీ సంసిద్ధతతో ఉండేలా, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలను, పార్టీ భవిష్యత్తు లక్ష్యాలను ప్రతి ఇంటికీ తీసుకువెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉన్నత ఆశయంతో మొదలైన పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఇప్పటికి నియోజకవర్గంలోని 28 డివిజన్లకు గాను 12 డివిజన్లలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా పూర్తి చేశామన్నారు. తమ పట్ల అపూర్వ ఆదరణ చూపిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని అన్నారు. ఇప్పటి వరకు కార్యక్రమం జరిగిన డివిజన్లలో ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిందంటే ఆయా డివిజన్ నాయకుల సహకారం, కృషి, తోడ్పాటు ఉందని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెల్పుతున్నామన్నారు. ఎవరెన్ని కుటిల పన్నాగాలు పన్నుతున్నా పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆగకుండా ఈ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఇంటింటికీ తిరిగి తాము లేవనెత్తే సమస్యల పట్ల పలు ప్రాంతాల్లో అధికారులు స్పందించిన దాఖలాలు ఉన్నాయని, ప్రజల సమస్యలను ఈరకంగా తీరుస్తున్నందుకు ఆనందంగా ఉందని, పరిష్కారం కాని సమస్యలను తాము ఎమ్మెల్యే అయి తీరుస్తామని అన్నారు. గడపగడపకు ప్రభుత్వం అంటూ కార్యక్రమం చేపట్టమని సాక్షాత్తు సీఎం జగన్ రెడ్డి గారు ఆదేశించినా నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి పట్టలేదని, కొన్నిరోజులు వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను, పోలీసులను వెంటేసుకుని తిరిగిరాని, ఇప్పుడు వారు కూడా తన వెంట తిరగకపోవడంతో రోజు కూలి మాట్లాడుకుని జనాన్ని తిప్పుకుంటున్నారని, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గడపగడపకు ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ గా మారిందని, పవనన్న ప్రజాబాట ప్రజల మన్ననలు పొందుతూ సూపర్ హిట్ గా నిలిచిందన్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది తామేనని, అందులో ఎలాంటి సందేహాలు తమకు లేవని అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా మారినా కాని, పొత్తులు ఎలా ఉన్నా కాని, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా తమకు సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. నాయకులు పావుజేన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, కార్తిక్, హేమంత్ రాయల్, రాము, జీవన్, కుక్క ప్రభాకర్, శ్రీకాంత్, వర ప్రసాద్, జఫర్, వినయ్, సుజన్ సింగ్, చరణ్, సీయోను, చిన్నా, దయాకర్, వెంకటేశ్వర్లు, దివాకర్, పవన్..
వీరమహిళలు సునంద, కుసుమ, ఝాన్సీ, మేరీ, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.