నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 301వ రోజున 9వ డివిజన్లో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక బంగ్లా తోట ప్రాంతానికి ప్రచార రథంలో చేరుకున్న కేతంరెడ్డికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, పూలమాలలు, శాలువాలతో, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటని అపూర్వంగా ఆదరిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే యజ్ఞంలో భాగమవుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోయేది తామేనని, నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.