నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 193వ రోజున 43వ డివిజన్లో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక డివిజన్ నాయకులు షేక్ బాబు నేతృత్వంలో కేతంరెడ్డిని పూలమాల, శాలువతో ఘనంగా సత్కరించిన అనంతరం కోటమిట్టలోని షాదిమంజిల్ ప్రాంతంలో కార్యక్రమం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 28 డివిజన్లకు గాను 11 డివిజన్లలో విజయవంతంగా పూర్తైన పవనన్న ప్రజాబాట నేడు 43వ డివిజన్ లో ఘనంగా ప్రారంభమవ్వడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ముస్లిం సోదరుల అపూర్వ ఆదరణతో ఉత్సాహంగా 42వ డివిజన్లో కార్యక్రమం సాగిందని, ఇప్పుడు 43వ డివిజన్లో సైతం వారి సమస్యలను అధ్యయనం చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీల విషయంలో ఎలా మోసం చేసిందో వివరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కలిగే లాభాలను ప్రతి ఇంటికీ తెలియజేస్తున్నామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com