• దక్షిణంలో విస్తృత కార్యక్రమాలు
• కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు
• ప్రతిచోట డాక్టర్ కందులకు సాదర స్వాగతం
విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పవనన్న ప్రజాభాట కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. నియోజకవర్గంలో ప్రతి వార్డులోను ఆయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో చేయని సేవా కార్యక్రమాలు అంటూ ఏవీ లేవు. ప్రతి ఒక్కరికి ఆయన అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో భాగంగా 34వ వార్డు నరహర వీధికి చెందిన పెళ్లి కుమార్తె లక్ష్మీ భవానికి బంగారు తాళిబొట్టు, పట్టు చీర, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా తనని కలిసి సహాయం పొందవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వాసుపల్లి నరేష్, నీలం రాజు, లుక్స్ గణేష్, సిరపు అప్పారావు, సతీష్ బద్రి, మనీ, వర, శ్రీదేవి, కోదండమ్మ, అనిత, పద్మావతి, సీత, లక్ష్మి, పద్మ, మంగ, లలిత, దుర్గ, కుమారి, దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com