నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 249వ రోజున 54వ డివిజన్ జనార్థన్ రెడ్డి కాలనీ ఇస్మాయిల్ పేట ప్రాంతంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో ఒక్క రోజు కూడా ఆటంకం లేకుండా పవనన్న ప్రజాబాట కార్యక్రమం 250వ రోజుకి చేరుకోనుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజలు ఎంత ఆదరాభిమానాలతో ఉన్నారో చెప్పేందుకు చిహ్నం అని అన్నారు. ఒక ప్రక్క సీఎం జగన్ రెడ్డి గారు తమ వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలకు గడపగడపకు పోండని చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా కూడా ఎక్కుడా కూడా పట్టుమని పది రోజులు కూడా ఏకధాటిగా ఆ కార్యక్రమం జరిగిన జాడే లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేక ఉన్నారని అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చూపని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ప్రజల్లో తమ మందిమార్బలాన్ని, పోలీసుల్ని వెంటేసుకుంటే కానీ తిరగలేని పరిస్థితి అని, ప్రస్తుతం నియోజకవర్గంలో కుక్కలు చింపిన విస్తరి మాదిరి వైసీపీ పార్టీ పరిస్థితి తయారైందని, కానీ ప్రజల అండదండలు, అపూర్వ ఆదరణతో జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలవబోయేది తామేనని, అంతటి ఆత్మవిశ్వాసాన్ని పవనన్న ప్రజాబాట తమలో నింపిందని అన్నారు. 250వ రోజు కార్యక్రమాలు 54వ డివిజన్లో కార్యక్రమంలో భాగంగా జరుగుతాయని, సైనికుడి ఇంటికి సేవకుడు పేరుతో జనసేన పార్టీ కార్యకర్తల ఇళ్ళకు వెళ్ళి వారి సాధకబాధకాలు కూడా తెలుసుకునే కార్యక్రమం కూడా మొదలుకానుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.