
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 149వ రోజున 49వ డివిజన్ గుండాల సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలందరి అపూర్వ ఆదరణతో పవనన్న ప్రజాబాట 150వ రోజుకి చేరుకుంటోందని, ఇప్పటివరకు నిర్విరామంగా, నిరాటంకంగా సుమారు 40వేల ఇళ్ళకు పైగా జనసేన పార్టీ సిద్ధాంతాలను, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నామని, ప్రతి ఇంట్లో ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం అని అన్నారు. 150 వ రోజున నెల్లూరు సిటీలోని ములుముడి బస్టాండ్ నుండి చిన్నబజార్ వరకు ప్రధాన వీధిలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం జరుగుతుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.