తూర్పుగోదావరి ( జనస్వరం ) : నిడదవోలు నియోజకవర్గo, మల్లేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ప్రియ సౌజన్య ఆధ్వర్యంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన అంధకారంలోకి వెళ్లిందని, సామాన్యుల జీవితాల్లో వెలుగులు రావాలంటే జనసేనపార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వైసీపీ నాయకులు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని త్వరలోనే వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పవనన్న ప్రజాబాట ద్వారా జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. క్షేత్ర స్థాయిలో జనసేనపార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని, స్థానికుల సమస్యలను గుర్తించి, పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెరవలి మండల జన సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మూడు కుటుంబాలకు ప్రియ సౌజన్య రూ. 3000 చొప్పున మూడు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య తాడేపల్లిగూడెం ఇంచార్జ్ అతిధిగా బొలిశెట్టి శ్రీనివాసరావు, నిడదవోలు నియోజకవర్గంలో గెలిచిన ఎంపీటీసీలు ఇంద్రా గౌడ్, వీరమల్లు లక్ష్మీ బాలాజీ, కాకర్ల కరుణ, కోలా సీతయ్య నాయుడు, ఆకుల అనంత లక్ష్మీ, నిడదవోలు నాయకులు రంగా రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి సదా వెంకటేష్, పుష్పా, దిద్దే రాజు, ANR, వినోద్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com