
విశాఖపట్నం ( జనస్వరం ) : దక్షిణ నియోజకవర్గం లో నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చేపడుతున్న కార్యక్రమం పవనన్న ప్రజాబాట కార్యక్రమం గురువారం నాటికి 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు దంపతులు దుర్గాలమ్మ గుడి, ఆంజనేయ స్వామి ఆలయం, సంపత్ వినాయక టెంపుల్ సందర్శించి పూజలు నిర్వహించారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 35 వ వార్డులో పూర్ణ మార్కెట్ ఏరియా, ప్రసాద్ గార్డెన్, కల్లు పాకలు వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటి గడపగడప వెళ్లారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరగబోయే మంచిని ఆయన ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన నాయకులు చేస్తున్న పోరాటాలను కూడా ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికార మార్పు తప్పదని స్పష్టం చేశారు. జనసేన వెంటే ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రఘు, త్రినాథ్, లక్ష్మి, అర్జున, గాజుల శ్రీను, కందుల నలినీ దేవి, స్వాతి, కేదార్నాథ్, బద్రీనాథ్ తో పాటు పలువురు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.