Logo
Date of Publish : 30 November 2022, 4:08 pm
Editor : Sake Naresh

ఆత్మకూరు నియోజకవర్గంలో 29వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం

          ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 29వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఉలవదిబ్బ, సోమశిల రోడ్డు ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా ఉలవదిబ్బ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు చంద్ర, నాగరాజు, తిరుమల, అనిల్, హరిబాబు, హజరత్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com