విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 79వ రోజుకు చేరుకుంది. దక్షిణ నియోజకవర్గంలో డాక్టర్ కందుల ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ముందు ఉండి వారికి సహాయాన్ని అందిస్తున్నారు. నిరుపేద మహిళలకు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు.
పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, నోటు పుస్తకాలను అందిస్తున్నారు. అనారోగ్య కారణాలతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు. తన సొంత నిధులతో నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తన సేవలను మరింతగా విస్తరిస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి అక్కడికి వెళ్తున్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజలను కలుస్తున్నట్లు తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నట్లు వెల్లడించారు. జనసేన తోనే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంటి, అప్పలరాజు, వేణు, దొడ్డి కిషోర్, మెకానిక్ చిన్న, చందు, అప్పారావు, శ్రీను, కృష్ణ, సూర్యనారాయణ, కుమారి, దుర్గా, హేమ, మంగ, దక్షిణ నియోజవర్గం యువ నాయకుడు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.