Logo
Date of Publish : 21 July 2022, 5:51 pm
Editor : Sake Naresh

నుకలాపుపేట గ్రామంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం

     ఎచ్చెర్ల ( జనస్వరం ) :  లావేరు మండలం గోవిందపురం పంచాయతీ నుకలాపు పేట గ్రామంలో జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వరావు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా కరిమజ్జి మల్లీశ్వారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన వివరించారు. గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు త్వరలోనే మండలాల వారిగా గ్రామ పర్యటనకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. అందేవిధంగా గ్రామ స్ధాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరిగిందన్నారు. జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు మాట్లాడుతూ  పవనన్న ప్రజాబాట ప్రారంభించి 87వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో గురించి వివరంగా చెప్పడం జరిగిందన్నారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో సోమినాయుడు, అప్పారావు, గౌరి నాయుడు, తిరుపతిరావు.గంగాధర్, గ్రామం పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com