ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, 28వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా, ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని, లక్ష్మణరావు పల్లి, బంగ్లా సెంటర్, ఎస్.టీ కాలనీలలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా బంగ్లా సెంటర్ వెనుక వైపున ఇళ్ల మధ్యన పాముల సంచారం ఎక్కువగా ఉందని, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేనపార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేనపార్టీ నాయకులు వంశీ, చంద్ర, నాగరాజు, భాను, గణేష్, హజరత్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com