సూళ్లూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 4వ రోజు ఓజిలి మండలం బండారుగుంట అగ్రహారం, పల్లెంపడు గ్రామాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంజని పుత్రుని ఆశీర్వాదంతో, జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తుల సహకారంతో పవనన్న ప్రజాబాట అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకుంటే మన సమస్యలు తీరుతాయని కరపత్రాలు పంచి గ్రామస్తులని కోరడం జరిగింది. మార్పు కోరుకుంటన్న గ్రామస్తులు పవనన్నతోనే ఆ మార్పు సాధ్యమని నమ్ముతున్నారు. పల్లెంపడు చెరువులో చేపలు పెంపకం కొరకు రసాయనాలు కలపడం వలన చుట్టుపక్కల భూగర్భ జలాలు కలిషితమయ్యి త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఉయ్యాల ప్రవీణ్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓజిలి మండలాధ్యక్షుడు యర్రమాక గోపి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురుప్రసాద్, పుచ్చకాట్ల ప్రశాంత్ యాదవ్, గురుకుమార్, నవీన్, ప్రసాద్, అశోక్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com