Logo
Date of Publish : 19 January 2023, 3:35 pm
Editor : Sake Naresh

రేపటి నుండి 54వ డివిజన్ లో పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

              నెల్లూరు సిటీ  ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 248వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ రాయపాలెం ఆర్చ్ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో నేటితో 11వ డివిజన్ పూర్తయిందని రేపటి నుండి 54వ డివిజన్ లో పవనన్న ప్రజాబాట జరుగనుందని తెలిపారు. 54వ డివిజన్లో మొదటి రోజున జనార్ధన్ రెడ్డి కాలనీ ఇస్మాయిల్ పేట ప్రాంతంలో కార్యకర్తల ఉత్సాహం నడుమ ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉన్నత లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమానికి బాసటగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తామని, ఈ మూడున్నరేళ్ళ వైసీపీ అధ్వాన్న పాలనలో ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోని నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని తామొచ్చాక సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com