Logo
Date of Publish : 26 September 2022, 3:36 pm
Editor : Sake Naresh

సూళ్లూరుపేట నియోజకవర్గంలో దిగ్విజయంగా 50 రోజులు పవనన్న ప్రజాబాట

         సూళ్లూరుపేట ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. పవనన్న ప్రజాబా కార్యక్రమం 50రోజులు పూర్తికావడంతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆదివారం సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపై అధ్యయనం చేస్తూ పవనన్న ఆశయాలు.. సిద్ధాంతాలతో పాటు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న మేనిఫెస్టోను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆశీస్సులతో నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాబాట కార్యక్రమం 50 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగింది అన్నారు. పవనన్న ప్రజాబాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లిన సమయంలో ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి వారి సమస్యలు తెలియజేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలిచి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలంతా భరోసా ఇస్తున్నారు అని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగురవేసి నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మారుస్తామని తెలియజేశారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఉన్న వేనాటి సుబ్బారెడ్డి కాలనీ లో 50వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో తన వెన్నంటూ నడుస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com