Logo
Date of Publish : 15 November 2023, 10:33 pm
Editor : Sake Naresh

పవనన్న ప్రజాబాటకు విశేష ప్రజాస్పందన

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సేవల కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి ప్రాంతంలోనూ పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో వ్యక్తిగతంగా కూడా పలు సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం 106వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 38వ వార్డు బుక్కా వీధి ప్రాంతంలో పెళ్లి కుమార్తెకు మౌనికకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమ అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ పదిమందికి మంచి చేయడమే తన లక్ష్యమన్నారు. తాను చేసే సేవా కార్యక్రమాలలో ఎటువంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవారికి తన సేవలో అందించాలని కృతనిచ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాయుడు, శ్రావణి, అరుణ్, రమేష్, సతీష్, పోలి, పైడిరాజు, లక్ష్మణ్, లక్షణ, పోలా, సురేష్, బద్రి సతీష్, దేవి, కనకమహాలక్ష్మి, సత్య, లక్ష్మి, సువర్ణ కుమారి, రావులమ్మ, గౌస్, మంగ, లలిత, గౌరీ, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com