Logo
Date of Publish : 29 August 2022, 1:47 am
Editor : Sake Naresh

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 101వ రోజు పల్లె పల్లెకు పవనన్న ప్రజాబాట

     ఎచ్చెర్ల, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వి.యన్.పురం పంచాయతీ పెదయాతపేట గ్రామం ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు & సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి.మల్లీశ్వరావు పల్లె పల్లెకు అలుపు ఎరుగని ప్రచారం చేస్తూ జనసేన మ్యానిఫెస్టో, సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ప్రజలకు అర్ధమైన రీతుల్లో వివరిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపిస్తే  సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు పెన్షన్ సౌకర్యం కొరకు కాలేదు.వృద్దులకు వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది.పవన్ కళ్యాణ్ ప్రజలు పక్షాన నిలబడిన నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడుని గెలుపించుకోలసిన బాధ్యత మనపైన ఉంది. అలాగే ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి గడపకి నిత్యం ప్రజల దగ్గరకి వెళ్లడం జరుగుతుంది. మేము ప్రతి గడపకి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసి ప్రజలకు అర్ధమైన రీతిలో జనసేన మ్యానిఫెస్టో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు.లక్ష్మునాయుడు మాట్లాడుతూ పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించినప్పటినుండి ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చామని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో వనుము.నాగరాజు, శ్రీరామ్, గౌరి, రామరాజు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com