Logo
Date of Publish : 15 September 2022, 2:53 pm
Editor : Sake Naresh

ప్రజల అపూర్వ ఆదరణతో పవనన్న ప్రజా బాట : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

     ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 5 వ రోజున 2 వ వార్డ్ వెంకట్రావుపల్లి ST కాలనీ నందు జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్  ఆ సమస్యల పట్ల తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలంతా విసిగి వేసారి పోయారని విమర్శించారు. సీఎం జగన్ అభివృద్ధిని గాలికొదిలేసి ఉచితాలు మళ్ళీ గెలిపిస్తాయనే భ్రమలో ఉన్నారన్నారు. ఎల్లకాలం ఓటు రాజకీయాలు సాగవని, నీతి నిజాయితీగా ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నేటి రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు చేసే నాయకులు ఒక్క పవన్ కళ్యాణ్  అని తాము గర్వంగా చెప్పగలమని, ప్రజలందరూ ఈ అంశాన్ని గుర్తించారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, పవనన్న ప్రభుత్వంలో రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని నలిశెట్టి శ్రీధర్ తెలియజేసారు. అలాగే విద్యుత్ షాక్ తో మరణించిన జనసేనపార్టీ కార్యకర్త గడ్డం వెంగయ్య(24) కుటుంబాన్ని నలిశెట్టి శ్రీధర్ పరామర్శించి, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం 10.000/- వేల రూపాయలను జనసేన పార్టీ నాయకులతో కలిసి అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com