విశాఖపట్నం ( జనస్వరం ) : దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతి వార్డులో ఆయనకు ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా 27వ వార్డు దొండపర్తి ప్రాంతానికి చెందిన పుష్పవతి అయిన అమ్మాయి లిఖితకు పట్టుబట్టలు, వెండి పట్టిలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది జనసేన ప్రభుత్వమేమని చెప్పారు. ప్రజల సమస్యలు తీరాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన అధికారంలోకి రావాలని చెప్పారు. ప్రజలు మంచి కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని అన్నారు. టిడిపి- జనసేన కలిసి వచ్చే ఎన్నికలలో పోటీకి వెళ్తున్నాయని. ఖచ్చితంగా ఈ పార్టీలు మెజార్టీ సీట్లు సాధిస్తాయని అధికారంలోకి వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు (చంటి ) రాజేష్, రాజు, శ్రీను, రమేష్, సాయి, టమాటా అప్పారావు, వర, శ్రీదేవి, కోదండ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com