Search
Close this search box.
Search
Close this search box.

61వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం

పవనన్న

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం లో పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నాటికి 61వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కార సాధన కోసం కృషి చేస్తున్నారు. అవసరమైన వారికి ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే జనసేన పార్టీ ధ్యేయమని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార సాధన కోసం కోసం ప్రజల తరఫునుంచి పోరాటం చేస్తామని తెలిపారు. ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పుష్పవతి అయిన అమ్మాయికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందించారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 41వ వార్డు, లోని పుష్పవతి అయిన అమ్మాయి జెస్మిత కు పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు అంతోని శేఖర్, రామారావు, ప్రసాద్, అప్పారావు, సూర్యనారాయణ, ప్రసాద్, మనోహర్, సునీత,వర, శ్రీదేవి , రాజేశ్వరి , ఝాన్సీ, మంగ, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way