నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 219వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ లక్కీ బోర్డు సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటూ సీఎం జగన్ గారు మాట్లాడారని, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం గుది బండలా మారిందని అన్నారు. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంలో ఇంటికో బాధని వివరిస్తున్నారని అన్నారు. బాలాజీనగర్ ప్రాంతంలో ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా కనిపిస్తోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.