నాగర్ కర్నూలు ( జనస్వరం ) : పవనన్న జెండా పల్లె పల్లె ఎగరాలని జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన మొదటి భాగం పాదయాత్ర తెలకపల్లి మండలం కార్వంగలో ప్రారంభించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ కు మాట్లాడుతూ పల్లె పల్లెలో ఎగరాలి పవనన్న జెండా కడప కడపను తాకాలన్నారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా అంటూ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. రెండు పడకల గదుల నిర్మాణం దళిత బంధు పింఛన్లు రేషన్ కార్డులు ఏ మేరకు వస్తున్నాయని ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గ్రామాలల్లో కనీస వసతులు లేవని మురుగునీరు ఏరులై పారుతున్నదని మల్టీ వర్కర్లు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని పింఛన్లు మంజూరైన బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండటం వల్ల డబ్బులు రావడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కారు వంగ నుండి నందిపేట గ్రామానికి నుండి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి నందిపేట నుండి కారణంగా వచ్చే విద్యార్థులు బడులు మానేసి పరిస్థితులు నెలకొంటాయి. పాదయాత్ర సందర్భంగా మా నమస్యలను ప్రభుత్వం దుస్థితికి వచ్చాయన్నారు. అంతముందు కారువంగ గ్రామంలో అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న గోపాస్ రమేష్, నారముళ్ళ రవీందర్, కోడిగ, సాయి కుమార్, బోట్కరమేష్ సూర్య, హారి నాయక్, రాజు నాయక్, శివ, భాస్కర్, తాడుర్ మండల నాయకులు, బిజినపల్లి మండల నాయకులు, నాగర్ కర్నూల్ మండల నాయకులు, తిమ్మాజీపేట మండల నాయకులు, జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com