కాణిపాకం ( జనస్వరం ) : అట్టడుగు స్థానంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన సత్తా ఉన్న ఏకైక నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కు ఆశాకిరణమైన "పవన్ కళ్యాణ్ గారు రావాలి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన మారాలి" అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్ రాయల్ పేర్కొన్నారు. కాణిపాకంలో నియోజకవర్గస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. రానున్న ఎన్నికలను ధీటుగా ఎదుర్కవడానికి సంసిద్ధులై, అందరూ కలసికట్టుగా ఏకతాటిపై నిలిచి సమిష్టిగా జనసేనపార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. చేయిచేయీ కలిపితే చేజారదు గెలుపని నొక్కివక్కాణించారు. పారద్శకతకు చిహ్నమైన "గాజు గ్లాసు" గుర్తును, "పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని కోరారు. ప్రతిపల్లెలోనూ జనసేనపార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారని, వాళ్ళనందర్నీ సమన్వయం చేస్తూ క్రియాశీలకంగా పనిచేసేలా కృషి చేసేందుకు శక్తివంచనలేకుండా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషిచేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, పార్టీ కోసం నిలబడిన సైనికులను ప్రశంసిస్తూ,యువత కోసం, రైతుల కోసం పార్టీ ప్రణాళికలు రచిస్తుందని ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ తెలియజేశారు.
జిల్లా కార్యదర్శి శివయ్య మాట్లాడుతూ పొత్తులో భాగంగా ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినా గెలిపించే దిశగా పనిచేస్తూ కలిసి ముందుకెళ్లాలని కోరారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందని, సుమారుగా 30 వేల ఓటర్లను ఉమ్మడి అభ్యర్థికి గెలిపించే దిశగా జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు.
తవణంపల్లి మండల అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ గ్రామ కమిటీలను పటిష్టం చేసుకుంటూ, ప్రజల సమస్యలకు అందుబాటులో ఉన్నామని, పవన్ కళ్యాణ్ ప్రజారంజక పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నట్లు చెప్పారు. యాదమరి మండల అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని, ఇరుపార్టీలు కలిసి ఈసారి పూతలపట్టు నియోజకవర్గంలో పట్టు సాధించి మిత్రపక్షాలకు పూతలపట్టు ఆయువుపట్టు అని నిరూపించి ఉమ్మడి జెండా ఎగరేస్తామని తెలియజేశారు. ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం గారు మాట్లాడుతూ ప్రజలను విడగొట్టే విధంగా అధికార పార్టీ పనిచేస్తుందని, వారి కుట్రపూరిత చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని తెలియజేశారు. బంగారుపాళ్యం మండల ఉపాధ్యక్షులు బాలు మాట్లాడుతూ ఊరు, వాడ జనసేనపార్టీ జెండా రెపరెపలాడుతూ ఉండాలని, ప్రతి పంచాయతీలో జండా ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షులు శీను, నవీన్ రాయల్, చందు, వేముల పవన్, త్యాగరాజు మాట్లాడుతూ గ్రామ కమిటీలు పంచాయతీ కమిటీలతో సమిష్టిగా సమన్వయం చేస్తూ పటిష్టంగా ముందుకెళ్తున్నామని చాపకింద నీరులాగా జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు.
వీరమహిళా నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం సంస్కృతులను కాపాడే సాంప్రదాయ కార్యక్రమాలను చేపడుతూ, ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ప్రజలకు బలంగా తీసుకెళ్తామని తెలియజేశారు.
మండల ప్రధాన కార్యదర్శులు ఉదయ్, తులసి బాబు, వాసు రాయల్, యువరాజ్, తులసి,అరుణ్, జాన్సన్ మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేశారు.
సీనియర్ నాయకులు కాణిపాకం దేవాలయ మాజీ చైర్మన్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. నాయకులు వెంకటేష్, ప్రభాకర్, భాను, మురళి, ప్రదీప్, వేణు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్ రాయల్ గారు, చిత్తూరు జనసేన నాయకులు మురళి గారు, వనిత గారు, జయశంకర్ గారు పవన్ రావాలి పాలన మారాలి అనే స్టిక్కర్లను సీనియర్ నాయకులచే ఆవిష్కరింపజేసి, అందరికీ పంపిణీ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com