
పలమనేరు ( జనస్వరం ) : జనసేన టిడిపి కూటమి విజయం కోసం సవరం పవన్ కుమార్ రాయల్ తిరుమల పాదయాత్ర చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూటమి అఖండమైన విజయం సాధించాలని కోరారు. పలమనేరు నియోజకవర్గ జనసేన నాయకుడు సవరం పవన్ కుమార్ రాయల్ పెద్ధ పంజాణీ మండలంలోని రాయల పేట నుంచి తిరుమల కొండకు పాదయాత్ర చేస్తున్నానని ఈ సారి జనసేన టిడిపి కూటమి విజయం సాధించాలని ఆ దేవ దేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు.