
- శ్రమదానం చేస్తున్న జనసేన నాయకులు కార్యకర్తలను అడ్డుకోవడం దుర్మార్గం.
- సీఎం వస్తే రోడ్లు వేసే వారు నేడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్లు వేస్తున్నారు.
- సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ప్రచార పిచ్చి
- వైఎస్ఆర్ లేకపోతే సీఎం జగన్ ఒక బచ్చ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంగీకరించినట్లేనా..?
- సీఎం జగన్ కి గాంధీ జయంతి అర్హత లేదు
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది, వెన్నులో వణుకు మొదలైంది, చెమటలు పట్టడం మొదలైందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అన్నారు. గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాలని పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా పనులు మొదలయ్యాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి వస్తే రోడ్లు వేసేవారు నేడు పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తే రోడ్లు వేస్తున్నారని, ప్రజలు చర్చించుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటున్న వైసీపీ పెద్దలు మరి ఎందుకు రోజుకు పది మంది మంత్రులు, ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు బయటికి వచ్చి ఎందుకు సమావేశాలు పెట్టి నోరు పారేసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. కోవిడ్ ఆంక్షలు పవన్ కళ్యాణ్ కే గాని సీఎం జగన్ కి వర్తించవా అని? ఈ రోజున ప్రచార ఆర్భాటం కోసం బెంజ్ సర్కిల్ వద్ద క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇదే కార్యక్రమాన్ని ఇంట్లో ఉండి కూడా స్విచ్ నొక్కి కార్యక్రమం చేయవచ్చని కానీ ప్రచార ఆర్భాటం కోసమే ఈ విధంగా ఏర్పాటు చేశారని, కోవిడ్ రాదని జగన్ కి ఏమైనా చెప్పిందా అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేయలేదని, అనేక చీకటి ఒప్పందాలు చేసుకుందని, పక్క రాష్ట్రాల బీసీ నేతలు, పచ్చనోట్లు, గులాబీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని ఈ విషయాన్ని వైసీపీ నాయకులు మర్చిపోయినట్టు ఉన్నారని మీడియా ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నారు. రోడ్డు సెస్ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఇందులో కేవలం 200 కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్లు ఇచ్చారని మిగిలిన 1300 కోట్ల రూపాయలు సీఎం జగన్ జేబులోకి వెళ్లాయయని, దీనిపై వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడి పారి పోతున్నారని, గతంలో చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు ఏ విధంగా ముందుకు వస్తారో వైసిపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రెండున్నరేళ్లుగా వైసీపీ నాయకుల బూతుపురాణం విని ప్రజలు చీదరించుకుంటున్నారని, నేడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నందుకు పది మంది మంత్రులు బయటికి వచ్చి ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారని, వైసీపీ నాయకులను ఒక్కమాట అంటేనే వారికి నొప్పి కలిగింది అని, మరి రెండున్నర సంవత్సరాల నుంచి ఇష్టానుసారం మాట్లాడుతున్న వారి పదజాలాన్ని ఎందుకు సీఎం నియంత్రించలేక పోయారా సమాధానం చెప్పాలన్నారు. వైసిపీ నాయకుల బూతు పంచాంగం ఎలా ఆపాలో పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసాని, ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మిమ్మల్ని తప్పనిసరిగా క్రమశిక్షణలో పెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటారన్నారు. మహాత్మా గాంధీ జయంతికి ఒక్కరోజు ముందు బ్రాందీ పాలసీ ప్రకటించి మద్యం అమ్మకాలు ప్రోత్సహించే లాగా జివో జారీ చేసిన వైఎస్ జగన్ కి గాంధీ జయంతి అర్హత లేదన్నారు. వైఎస్సార్ లేకపోతే అసలు జగన్ రెడ్డి ఎవరని తండ్రి ఫోటో అడ్డం పెట్టుకొని ఓట్లు అడుక్కునే వ్యక్తి జగన్ అని, సీఎం జగన్ రెడ్డి సంఘ సంస్కర్త? లేక జాతి నాయకుడు అని? వైఎస్సార్ లేకపోతే జగన్ ఒక బచ్చ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంగీకరించినట్లేనని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గతంలో వారి ఇంటిని ముట్టడిస్తామని వస్తే పోలీసులు అడ్డంపెట్టుకుని పారిపోయారని ఇంకొకసారి పిచ్చి వాగుడు వాగితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.