సత్తెనపల్లి ( జనస్వరం ) : రాజుపాలెం మండలంలో అంచులవారిపాలెం గ్రామం లో ఘనంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అంచులవారిపాలెం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్లి సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది.. రాజుపాలెం మండలం ZPTC అభ్యర్థిగా పోటీ చేసిన బసవల శైలజ గారు మరియు అంచులవారిపాలెం గ్రామ అధ్యక్షులు బసవల వెంకటకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలకు 5లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారి గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలలు అని తెలియజేశారు… జనసేన పార్టీ సభ్యత్వం పొందడం అంటే జనాన్ని దోచుకునే అవినీతి పరమైన మరియు అనైతిక రాజకీయాలకు అతీతంగా నిజమైన జనసేవకుడు కంకణం కట్టుకోవడమే.. ఈ కార్యక్రమాలకు రాజుపాలెం మండల కార్యదర్శి క్రియాశీలక వాలంటీర్ తమ్మిశెట్టి మహేష్ బాబు, మండల సంయుక్త కార్యదర్శి గలబా నాగేశ్వరరావు, బూత్ కమిటీ తోట నాగేశ్వరావు, తోట సుబ్బారావు, వేపూరి వెంకటేశ్వర్లు, అంచుల చిన్న వెంకయ్య, అంచుల శ్రీకాంత్, తోటశివరావు, లింగంపల్లి కొండలు, అంచుల కుమారస్వామి,పోకల వీరయ్య నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు…..