మదనపల్లి ( జనస్వరం ) : రాష్ట్రంలో మూడేళ్ల కాలంతో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ప్రకారం 29 వేల మందికి పైగా మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కావడం జరిగిందని, దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత కొరవడిందని జనసేన నాయకులు మై పోర్స్ మహేష్ ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైఫోర్స్ మహేష్ మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో వీర మహిళలు మల్లిక, సునీత, జనసైనికులు సందీప్, శ్రీనాథ్, రమణ, బాషా, షమి, దేవా, అసిఫ్ రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించడం కోసమే జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా పోరాటం మొదలు పెట్టారని వివరించారు. రాష్ట్రంలో వైసీపీ పోవాలని జనసేని పవన్ కళ్యాణ్ బలంగా పనిచేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. వైకాపా ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేదిస్తున్నారని, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వారహి యాత్ర చేపట్టగానే అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యులు ఎదురు దాడికి దిగుతూ, విమర్శలు చేస్తుండటంపై నిప్పులు చెరిగారు. ఇందుకు తగిన సమయంలో ప్రజలే గుణపాటం చెబుతారని హెచ్చరించారు. గడిచిన 14 సంవత్సరాల నుండి ప్రజల సమస్యలుపై జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో తాను సిఎం పదవి చేపట్టడానికి ఎప్పుడో సిద్దమని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వైకాపా ముఖ్యమంత్రి తన సొంత కుటుంబానికి న్యాయం చేయలేక పోయారని ఇక రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని ఏద్దేవా చేశారు. జనసేన పార్టీ వీర మహిళ సునీత మాట్లాడుతూ జనసేన పార్టీలో మహిళలకు గౌరవం వుందని, జనసేన పార్టీ వీర మహిళ అయినందుకు గర్వంగా వుందన్నారు. పవర్ స్టార్, సిఎం, సిఎం అని కేకలు వేయడం ఆపి పార్టీ బలోపేతం కోసం పని చేయాలని, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, పవన్ కళ్యాణ్ సిఎం కావాలనే నినాదంతో గ్రామస్దాయి నుండి పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేద్దాంమని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే వారు నోరు అదుపులోకి పెట్టుకుంటే మంచిదని జనసేన వీర మహిళ మల్లిక హెచ్చరించారు. మీకు ప్రజలు గేటు పాస్ ఇచ్చి సాగనంపడానికి సిద్దంగా వున్నారని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.