• గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరవుతు అనురాధ
తెనాలి, ఏప్రిల్ 13 (జనస్వరం) : రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయుచున్న జనసేన బిజెపి తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ల విజయం కోరుతూ తెనాలిలో ఆదివారం జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరవుతు అనురాధ కోరారు. శనివారం భట్టిప్రోలు విలేకరులతో ఆమె మాట్లాడుతూ తెనాలి పట్టణంలో మార్కెట్ సెంటర్ లో సాయంత్రం గం 4 లకు జరిగే ఎన్నికల బహిరంగ సభలో జనసేన నేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆమె తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు తెనాలి వేమూరు అసెంబ్లీ పరిధిలోని జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి సభను జయప్రదం చేయాలని ఆమె కోరారు.