రాజాం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను వాలంటీర్ తగలబెట్టడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) మాట్లాడుతూ అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అవినీతే లక్ష్యంగా నైపుణ్యం కలిగిన లక్షలాదిమంది యువతను కేవలం 5000 రూపాయలు ఇచ్చి, వెట్టి చాకిరీ చేయిస్తు,యువతను వైసీపీ కార్యకర్తలు గా మార్చే ప్రయత్నము చేస్తున్నారు. యువతను నిరుద్యోగులుగా మార్చుతున్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు,అభివృద్ధి లేదు.ఇలా ఏ ఒక్క సిద్ధాంతాలపైన మాట్లాడ లేని వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడం, యువతను ప్రక్క తోవ పట్టిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం యువతకు భేసరతు గా క్షమాపణ చెప్పాలి అని అన్నారు.అనంతరం గుంతల మయం అయిన రాజాం పాలకొండ రహదారి నిమిత్తం #HelloAP_ByeByeYCP నినాదాలతో నిరసనను తెలియజేసి తాత్కాలికంగ అయిన అద్వానంగా ఉన్న గుంతలను పూడ్చి ప్రజలకు ఈ వర్షాకాలం లో తాత్కాలిక ఉపశమనం చేపట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో త్వరలో భారిమొత్తంలో జనసైనికులతో నిరసన తెలియజేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, సామంతుల రమేష్, ఎన్ని సత్యం,మీసాల లక్షుమ్ నాయుడు,నాగరాజు, శ్రీనివాస్,ఈశ్వర్,రాంబాబు, వెంకటేష్ శంకర్ శ్యామ్ జనసైనికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com