- సంజీవయ్య శతజయంతి సందర్భంగా రూ.కోటి విరాళం ప్రకటించాలి.
- రాజకీయ జీవితం అంటే ప్రజల కోసం బతకాలి...
- జనసేన ఏపీసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
కర్నూలు, (జనస్వరం) : దామోదరం సంజీవయ్య గారి స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నదే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గారిని సంకల్పమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ అన్నారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముందుగా కల్లూరు మండల పరిధిలోని పెద్ద పాడు గ్రామంలోగల దామోదరం సంజీవయ్య గారి స్వగృహాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ సంజీవయ్య శతజయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ గారు రూ.కోటి విరాళం ప్రకటించాలని కోరారు. రాజకీయాల్లో నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. సంజీవయ్య లాంటి నాయకుల త్యాగ ఫలితంగానే మనం తలెత్తుకుని తిరుగుతున్నామని గుర్తు చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com