Logo
Date of Publish : 19 July 2023, 9:50 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి చిత్రా పటానికి పాలాభిషేకం చేసిన జనసైనికులు

          ఆత్మకూరు ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థను మొత్తాన్ని తప్పు పట్టలేదని, వ్యవస్థలో కొంతమంది చేసే పనులను మాత్రమే చెప్పారని అన్నారు. అలాగే వాలంటీర్లుగా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ల సైతం అయిదు వేల రూపాయల కోసం వాలంటీర్ జాబ్ చేస్తున్నారన్నారు. అంటే రోజు కు 166 రూపాయలు తో 10 గంట లు చాకిరీ పని చేయడం దారుణమని, వారికి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మంచి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని  పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్ప కొంతమంది వైసీపీ నాయకులు కావాలని వాలంటీర్లను కించపరచారని దుమారం రేపడం సరికాదన్నారు. వారాహి యాత్ర విజయవంతంగా సాగుతున్న సందర్భంగా వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర పన్నినట్టు తెలుస్తుంది అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులుశ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ కరిముల, మంగు దొడ్డి హరి కృష్ణ నాగభూషణం, వెంకట్ రమణ, పెనగలురు చిన్నయ్య, గల్ల నాగ రాజు, అజయ్ తదితర పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com