తిరుపతి ( జనస్వరం ) : ఇటీవల వైకాపా శ్రేణుల చేతిలో గాయపడిన పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి పల్లి మండలం లక్కన పల్లి పంచాయతీ కి చెందిన జనసేన మండల కార్యదర్శి మధుని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పి ఏ సి సభ్యులు డా పసుపులేటి హరిప్రసాద్ పరామర్శించారు. స్థానిక MLA చేస్తున్న గడప గడపకి కార్యక్రమంలో తమ ఇంటికి కేటాయించిన పత్రాలు చూపించి నా ఇళ్ళు కొంతమంది నాయకులు అమ్ముకునేశారు అని తెలియచేస్తే వాళ్ళు జనసేన నాయకుడు మధుపై తీవ్రంగా దాడి చేసారని అతనికి తలపైన 8కుట్టు పడేలా కొట్టారన్నారు. వై కా పా గుండాల దౌర్జన్యలకు జనసేన భయపడదని మధు కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడి చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి 307 అట్టెంప్ట్ టూ మర్డర్ పైన రెఫెర్ చేయాలనీ పలమనేరు DSP ను పసుపులేటి హరిప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, రాయలసీమ కో-కన్వినర్ రాందాస్ చౌదరి, జీడీ నెల్లూరు ఇంచార్జ్ డా. పొన్న యుగంధర్, పీలేరు ఇంచార్జ్ బెజవాడ దినేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జెంగాలా శివరాం, కార్యదర్శులు పసుపులేటి దిలీప్, ఆనంద్, రవి, యస్వంత్, సంయుక్త కార్యదర్శి రాఘవ, వీరమహిళా పుష్ప, పలమనేరు మండల ఇంచార్జ్లు, హరీష్ రాయల్, నాగరాజు ఏ వి బాబు, చందు, చైతన్య కుమార్ శివ, సీనియర్ నాయకులు రమేష్, అనిల్ జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.