Logo
Date of Publish : 17 December 2020, 11:11 am
Editor : Sake Naresh

జనసైనికుల శ్రేయస్సే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం” : త్యాడ రామకృష్ణారావు (బాలు)

జనసైనికుల శ్రేయస్సే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం" : త్యాడ రామకృష్ణారావు (బాలు)

                      జనసేన పార్టీక్రియాశీలక సభ్యత్వాలు విజయనగరం నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆదేశం మేరకు చాలా జోరుగా సాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బాలు మాట్లాడుతూ జనసైనుకుల శ్రేయస్సే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అని, అందుకే కార్యకర్తలు సభ్యత్వం తీసుకోవడంతో పార్టీ సిద్ధాంతాలను, అధినేత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశంతో పాటు జీవితభీమా సౌకర్యాన్ని కల్పించారని, ఈ క్రియాశీలక సభ్యత్వాలకు ప్రజాల్లోనూ, యువతీయువకుల్లోను మంచిస్పందన లభిస్తుందని అన్నారు.  నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు గారు మాట్లాడుతూ ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఐనా వారి స్వార్థం కోసమే పనిచేసాయని కార్యకర్తలకోసం ఆలోచించలేదని, ఈ బృహత్కార అవకాశం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుండి జనసైనుకులకు లభించిందని, ఈ అవకాశాన్ని అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, రవిరాజ్ చౌదరి, హుస్సేన్ ఖాన్, వేణు, అడబాల వెంకటేష్ నాయుడు గారు, పళ్లెం కుమారస్వామి, వడిగి భాస్కరరావు గారు, జిల్లా చిరంజీవి యువత సభ్యులు చెల్లూరి ముత్యాల నాయుడు, బూడివాసు, సునీల్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com