Logo
Date of Publish : 13 July 2023, 3:07 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాద్ధాంతం తగదు : మాదాసు మురళి

            ఆచంట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలను ప్రశ్నించినందుకే అయినపై వాలంటరీల ముసుగులో వైయస్సార్ పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో అలజడి సృష్టిస్తున్నారని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ పేర్కొన్నారు. స్థానిక ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వాలంటరీ లను ఎక్కడ అసభ్య పదజాలంతో దూసించకున్న ప్రజాసమస్యల పై ప్రభుత్వాని నిలదీస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ఈ ప్రభుత్వం వాలంటరీలను దూసించినట్టు ఒక అద్భుత కల్పనా సృష్టించి వారికి నిరసన కార్యక్రమాలు చేయాలని లేనిచో మీ వాలంటరీ ఉద్యోగం లోనించి తొలిగిస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.  వారి ముసుగులో వైసీపీ పార్టీ నాయకులు రాష్ట్రములో అలజడి సృష్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, కాకినాడ ఇంకా ఎన్నో చోట్ల మహిళలకు మాన ప్రాణాలకు నష్టం వాటిల్లిన స్పందించని మహిళా కమిషన్ ఒక పవన్ కళ్యాణ్ కు నోటిస్ పంపడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా కమిషన్ రాష్ట్రంలో ని మహిళల కోసం పని చేస్తుందా లేక ప్రతిపక్షాల గొంతు నొక్కడకా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు వస్తున్న ఆశేష జనాల చూసి జీర్ణించు కొలెక ముఖ్యమంత్రి మొదలుకొని కింద స్థాయి నాయకుల వరకు సమస్యలను పరిస్కరించ కుండా ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడుతున్నారంటే వీరిని అసమర్ధ నాయకులు అనాలన లేక ఏమనాలో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో జనసేన సైనికులు నాగరాజు, రవి శంకరెడ్డి , వాసుదేవ్, రమేష్ రెడ్డి , కిషోర్ లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com