Logo
Date of Publish : 03 September 2020, 3:54 pm
Editor : Sake Naresh

ఖమ్మం లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఖమ్మంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

          తెలుగు సినివినీలాకాశంలో చిరు తమ్ముడిగా వచ్చి అనతికాలంలోనే లక్షలాది అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ గా అనూహ్యమైన స్థానం సంపాదించుకొని, ఇరురాష్ట్రాల తెలుగు ప్రజల కోసం జనసేన పార్టీ స్థాపించిన జనహృదయ నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఖమ్మం లో జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ సేవ సమితి నాయకులు, చిరంజీవి గారి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ సేవ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు చిరంజీవి గారి సీనియర్ అభిమాని Md. సాధిక్ అలీ, పవన్ కళ్యాణ్ సేవ సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల గడ్డం మహేష్ , సూరజ్ కిరణ్, తదితరుల ఆధ్వర్యంలో వృధాశ్రమంలో అన్నదానం, మరియు జన్మదిన కేక్ కట్ చేసినారు. ఈ సందర్బంగా జనసేన జిల్లా నాయకులు Md. సాధిక్ అలీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అభిమానులు ఘనంగా జరుపుకున్నారని, వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అదేవిధంగా ప్రతి పుట్టినరోజున అభిమానులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవారమని కరోనా మహమ్మారి వల్ల ఈ సారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయలేదని తెలిపారు. జన్మదినవేడుకల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతూ చనిపోయిన మరియు వరంగల్ నుండి పరకాల్ వెళుతూ యాక్సిడెంట్ కు గురై చనిపోయిన అభిమానులకు సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు ఎన్ని అవాంతరాలు ఎదురైన జనసైనికులుగా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల జగన్, సూరజ్ కిరణ్, బండారు రామకృష్ణ,గౌరిశెట్టి వినోద్, శ్రీను, లక్ష్మణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com