- కందుకూరు గ్రామ పంచాయితీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
- గ్రామ పంచాయితీ ఆవరణలో మొక్కలు నాటిన వైనం
- పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి సన్మానం
- పవన్ కళ్యాణ్ పటానికి పాలాభిషేకం
- కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, టీడీపీ, బీజేపీ నాయకులు
అనంతపురం రూరల్, సెప్టెంబర్ 2 ( జనస్వరం ) : జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామ పంచాయితీలో పుట్టినరోజు వేడుకలు సంబరాలు అంబరాన్ని ఉంటాయి. ఈ మేరకు స్థానిక జనసేన నాయకులు సాకే నరేష్, సాకే రవి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జనసేన రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ రాగే మురళి విచ్చేశారు. తెలుగు రాష్ట్రాలలో చేపడుతున్న క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయితీ ఆవరణ నందు మొక్కలు నాటడం జరిగింది. పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కందుకూరు గ్రామంలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఎన్‌డిఏ కూటమి నాయకులు శాలువా కప్పి సన్మానం చేశారు. వారికి కొత్త బట్టలు అందజేశారు.
రాప్తాడు జనసేన ఇంచార్జ్ పవన్ కుమార్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ రాష్ట్ర చరిత్ర లో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ ది అన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. శాఖల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారన్నారు. రాగే మురళి మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వ౦ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆయనపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోరు మూయించేలా నేడు జనసేన పార్టీని నిలబెట్టాడన్నారు. రాష్ట్ర ప్రజల కోసం గతంలో ఎంతగానో కష్టపడ్డాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని ఆయన అన్నారు. పంచాయితీ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యక్రమాలను చేస్తున్న జనసైనికులను అభినందించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చేపడుతున్న క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అయిన ఎన్‌డిఏ కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు. గ్రామ పరిధిలో గ్రామ శుభ్రత కోసం పాటు పడుతున్న మున్సిపల్ కార్మికుల శ్రమను గుర్తించి వారిని సన్మానించడం, కొత్త బట్టలు అందజేయడం మంచి పరిణామమన్నారు. తెలుగుదేశం నాయకులు ఓబిరెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతం, ప్రజల కోసం ఎంతకైనా పోరాడే విలువలున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఎన్‌డిఏ కూటమి నాయకులు కలసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుదామని అన్నారు. రానున్న రోజుల్లో పంచాయితీ అభివృద్ధి లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇతర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొందని, పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన జనసైనికులను అభినందించారు. పవన్ కళ్యాణ్ తాను నిర్వర్తించే శాఖలలో మంచి అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకున్నారు. చివరగా కేకు కట్ చేసి, స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకుల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.