Logo
Date of Publish : 03 September 2022, 8:22 pm
Editor : Sake Naresh

అనంతపురం జనసేనపార్టీ మహిళ కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

    అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా వారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ జనసేన 2014 మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులపై, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్న పార్టీ జనసేన అని తెలిపారు. జనసేన పార్టీ నా సేన కోసం - నా వంతు అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి విరాళాల సేకరణను చేపట్టింది. అందులో మేము కూడా భాగస్వాములమవుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు విరాళాల సేకరణను చేపట్టి ప్రజలకు జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేస్తూ వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నా వంతుగా 1,116,000 వేల రూపాయలు చెక్కును పార్టీకి అందించడం జరిగిందని అలాగే శ్రీలతని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీకి మరి కొంతమంది ఫండ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల హరి, జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవ రాయుడు, రాపా ధనుంజయ, కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్, నగర అధ్యక్షులు బాబురావు, ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, రోళ్ళ భాస్కర్, కమతం వెంకటనారాయణ, దరాజ్ భాష, నగర కార్యదర్శిలు పద్మావతి, సువర్ణమ్మ, లాల్ స్వామి, ఆకుల ప్రసాద్, రమణ, వీర మహిళలు కాశెట్టి సావిత్రి, శ్రీదేవి, రూప, వరలక్ష్మి, శారద, మంజుల, భావన, ఉమాదేవి, లక్ష్మి, నాయకులు తోట ప్రకాష్, శరత్, పెండ్యాల గురు ప్రసాద్, దండు హరీష్, మధు, నజీమ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com