విజయవాడ ( జనస్వరం ) : 46వ డివిజన్ సాయిరాం సెంటర్ నాగమ్మ సత్రం వద్ద బెవర. లోకేష్ తో 100 మంది యువత మరియు స్థానిక పెద్దలు గోపిశెట్టి.వెంకన్నలు పవన్ కళ్యాణ్ గారి ఆశయ పోరాట స్ఫూర్తిగా ఆకర్షితులై పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరినారు వీరికి పోతిన మహేష్ స్థానిక డివిజన్ అధ్యక్షులు షేక్ షర్మిల అమీర్ భాష సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినారు వీరికి తొందర్లోనే పార్టీలో పదవుల కేటాయించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినారు. ముందుగా కలరా ఆసుపత్రి సెంటర్ వద్ద నుంచి తీన్మార్ తో భారీ ర్యాలీ నిర్వహించినారు, వేదిక వద్దకు చేరుకున్న మహేష్ బెవర లోకేష్ మరియు మిత్ర బృందం భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని చాలా బలంగా నడుపుతున్నారని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని కౌలు రైతులను ఆదుకున్న ఆపద్బాంధవుడని రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరుగుతున్నాయని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తద్యమని అలాగే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని అనేక సమస్యలపై జనసైనికులు నాయకులు వీర మహిళల మద్దతు పోరాటం చేశామని అనేక విజయాలు సాధించామని వాటిలో ప్రధానంగా అమ్మవారి ఆలయంలో చోరీకి గురైన మూడు సింహాలు ఘటన దుర్గా బ్యాంక్ బోగవల్లి సత్రం ట్రస్ట్ మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీస్ విఎంసి కార్యాలయంలో 150 ఉద్యోగాల అమ్మకం కేటి రోడ్ అస్లాం మృతి కేసు గాలిబ్ షాహీబ్ దర్గా భూములు, సితార సెంటర్ వద్ద వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహం ఏర్పాటు ముసాఫిర్ ఖానా ఇలా అనేక అంశాలపై పోరాటం చేశామని అన్యాయం జరిగిందంటే కులం మతం పార్టీ చూడకుండా బాధితులు తరఫున పోరాటం చేశామని వారికి అండగా నిలబడి ఉపశమనం కల్పించామని పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ చూసిన పోతిని మహేష్ చూసిన బెల్లంపల్లి శ్రీనివాస్ కు ప్యాంటు తడిసిపోతుందని అందుకనే గత వారం పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద బ్యానర్లను అర్ధరాత్రి పూట వందల మంది ప్రభుత్వాధికారుల అడ్డం పెట్టుకుని తొలగించారని ఇది చూస్తేనే వెల్లంపల్లి. శ్రీనివాస్ కు భయం ఏ స్థాయిలో పట్టుకుందో అర్థమవుతుందని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గంలో 25వేల మెజార్టీతో తాను గెలిచి తీరుతానని మహేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక డివిజన్ అధ్యక్షులు షేక్ షర్మిల అమీర్ భాష మాట్లాడుతూ రాబోయే నెలలో మరొక 200 మంది ఎస్సీ, ఎస్టీ ముస్లింలను పార్టీలో చేర్చి స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ చేరికలతో వైఎస్ఆర్సిపి పార్టీకి చలి జ్వరం పట్టుకుంటుందని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు.బేవర్ లోకేష్ తో పాటు మధు సాయి శ్రీను అంజ ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతో శ్రమించారని మహేష్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాదర్ల శివ ,బుద్ధన ప్రసాద్, శ్రీరామ్ శ్రీనుబాబు జగదీష్, కరిముల్లా, వడ్డాది రాజేష్ తో పాటు డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి. కనకారావు, బొమ్ము రాంబాబు, పొట్నూరి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి గంగాధర్, సోమి గోవింద్, సింగరేణి శెట్టి రాము గుప్తా మరియు నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్,బొట్టు. సాయి ,పులిచేరి రమేష్, దాసిన జగదీష్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.