విజయనగరం ( జనస్వరం ) : వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ రామచంద్రరావు ఆకాంక్షించారు. విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశం ఆదివారం జరిగింది. కొత్తగా ఏర్పాటైన లీగల్ సెల్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ లోగోను ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ వారిపై ఉన్న కేసులపై పోరాడడమే లీగల్ సెల్ ముఖ్య ఉద్దేశ్యమని వక్తలు పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లతో జనసెన లీగల్ సెల్ అనుసంధానంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మూడు జిల్లాల నుంచి జనసేన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు హాజరై తమ అభిప్రాయాల్ని వెల్లడిరచారు.
అనుబంధ సంఘాలు భాగస్వామ్యం కావాలి :
ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ అనుబంధ సంఘాలన్నీ పార్టీని బలోపేతం చేసేలా పార్టీ నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలన్నారు. పార్టీ అధినేత పవన్ విశాఖ విచ్చేసినప్పుడు ఇక్కడి విమానాశ్రయంలో జరిగిన సంఘటన నేపథ్యంలో నమోదైన అక్రమ కేసుల్ని కోర్టుల్లో ఏ విధంగా నివృత్తి చేసుకోవచ్చో న్యాయవాదులు వివరించారు. కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా అధ్యక్షుడు డోల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లీగల్ సెల్ అనేది పార్టీకి రక్షణ కవచం కావాలన్నారు. అందుకే పార్టీ అధినేత ఈ లీగల్ సెల్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కావాలన్నారు. తాము కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, కిరణ్, తూ.గో జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్, శ్రీకాకుళం అధ్యక్షుడు ఫల్గుణ రావు, విశాఖ లీగల్ సెల్ అధ్యక్షురాలు ఎర్రా రేవతి వివిధ ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.