
– అమరావతి నుంచి విజయవాడకు హెలికాప్టర్లో వెళ్లే వ్యక్తి జగన్
– కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్
– జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు
నెల్లూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి నుంచి విజయవాడకు హెలికాప్టర్లో వెళ్లే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఓ పక్క జి20 సదస్సు జరుగుతుందని, ఎన్నో కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటే.. ఈ విపత్కర పరిస్థితిని చూసి వారు భయభ్రాంతులతో వెనక్కి వెళ్ళిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. లండన్ లో ఆస్తులు కొనుగోలు చేసేందుకే సీఎం జగన్ వెళ్లారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను ఐదు నిమిషాలు నిర్బంధిస్తేనే ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన కక్ష సాధింపు చర్యలో భాగంగా రాష్ట్రాన్ని గందరగోళ స్థితిలోకి తీసుకొచ్చారన్నారు.